పెద్దపల్లి,జనతా న్యూస్ : పెద్దపల్లి అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ గా గజ్జి కృష్ణ నియమిస్తూ ఈస్ట్ జోన్ ఐ జి ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ఏసీపి గా పనిచేస్తున్న ఎడ్ల మహేష్ వేరేచోటికి బదిలీ అయ్యారు. పెద్దపల్లి జిల్లాలో గతంలో గజ్జి కృష్ణ కాల్వ శ్రీరాంపూర్, బసంత్ నగర్ కమాన్పూర్ ఎస్సై గా, మంథని, గోదావరిఖని సీఐగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ప్రాంతం పై అపార అనుభవం ఉన్న గజ్జి కృష్ణ పెద్దపల్లి ఏసీపి గా రావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సేవా కార్యక్రమంలో ముందుండే గజ్జి కృష్ణ ఏ ప్రాంతంలో పనిచేసిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కాల్వ శ్రీరాంపూర్ ప్రాంతంలో పనిచేస్తున్న సమయంలో అక్కడ ఉన్న చెంచు వాళ్లకు గృహాలు నిర్మించి ప్రత్యేకత చాటుకున్నారు. అప్పుడున్న డిజిపి స్వరన్ జిత్ సేన్ చెంచు గృహాలను ప్రారంభించారు. ఒక తీవ్రవాద మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న ఎస్ఐ తాను చేస్తున్న సేవలకు రాష్ట్రస్థాయి గుర్తింపు లభించింది. పెద్దపల్లి జిల్లాలో ఎస్సై, సీఐగా సేవలందించిన గజ్జి కృష్ణ మళ్ళీ పెద్దపల్లి ఏసీపీగా అవకాశం రావడం పట్ల ఈ ప్రాంత ప్రజలు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పెద్దపల్లి ఏసీపీగా కృష్ణ
- Advertisment -