సిరిసిల్ల, జనతా న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో జరుగుతున్న గీత మందిరం వార్షిక ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం పూర్ణాహుతి శిఖీర ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ను ఘనంగా నిర్వహించారు.
నూతనముగా నిర్మించిన సుబ్రహ్మణ్యస్వామి మందిరములో వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్ట, శ్రీ యజ్ఞవలికియ దిలీప్ శర్మ శ్రీ శుభంకరి పీఠం హైదరాబాదు వారి ప్రవచనం చేశారు. సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు శ్రీ రాధాకృష్ణ మందిరము లో రాధాకృష్ణ వివాహ సందర్భముగా ఎదుర్కోలు ఉత్సవం వైభవం నిర్వహించారు.
