హైదరాబాద్, జనత న్యూస్:తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ గచ్చబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. వేంకటేశ్వర్లు ఆయుష్ శాఖలో ప్రొఫెసర్ గా, అడిషినల్ డైరెక్టర్ గా పనిచేశారు. అనంతరం ఆయన వైరాలో హోమియో వైద్య శాలను నిర్వహిస్తున్నారు. మూడు నెలల కిందట కాలేయ వ్యాధి సమస్య వచ్చింది. అప్పటి నుంచి హైదరాబాద్ చికిత్స తీసుకుంటున్నారు. మల్లు వేంకటేశ్వర్లు స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో మంగళవారం సాయంత్ర అంత్యక్రియులు సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mallu Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో తీవ్ర విషాదం..
- Advertisment -