మంథని, జనత న్యూస్: భూపాలపల్లి జిల్లాలో నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మీబ్యారేజ్) సందర్శనకు అంతా సిద్ధమైంది. రాష్ట్ర ప్రతినిధుల బృందం మరి కాసేపట్లో ఇక్కడికి బయలుదేరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించనున్నారు. ఉదయం 10.15 గంటలకు అసెంబ్లీ నుంచి నేరుగా మేడిగడ్డకు బయలుదేరుతారు. సాయంత్రం 3 గంటలకు మేడిగడ్డకు చేరుకుంటారు అనంతరం ప్రాజెక్టును పరిశీలించిన తరువాత అక్కడ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. రెండు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటషన్ ద్వారా ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.ఈ ప్రాజెక్టులో నిర్మాణ లోపాలు ఎత్తి చూపేందుకు ప్రజాప్రతినిధులందరినీ సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించిన విషయం తెలిసిందే.
Medigadda Project: మరికాసేపట్లో మేడిగడ్డకు పయనం..
- Advertisment -
