కరీంనగర్, జనతా న్యూస్: పోలీస్ కమిషనరేట్ లోని పలువురు ఏసీపీలను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరీంనగర్ రూరల్ ఏసీపీ కరుణాకర్ రావు వనపర్తికి బదిలీ అయ్యారు. ఇంటలిజెన్సీలో డీఎస్పీగా పనిచేస్తున్న పి వెంకటరమణ కరీంనగర్ రూరల్ ఎసిపి గా నియామకమయ్యారు. అదిలాబాద్ డీసీఆర్సీ డిఎస్పి సిహెచ్ శ్రీనివాస్ హుజురాబాద్ ఏసీబీగా బదిలీ అయ్యారు. హుజరాబాద్ ఏసిపి జీవన్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. కాజీపేట ఏసీపీ పి డేవిడ్ రాజును కరీంనగర్ పిటిసికి.. కరీంనగర్ పిటిసి డిఎస్పి మహేష్ బాబును రామగుండం సిసిఎస్ ఎసిపిగా బదిలీ చేశారు. కరీంనగర్ సిసిఎస్ ఏసిపిని మాధవిని రామగుండం సిసిఆర్సి ఏసిపిగా బదిలీ చేశారు..
ACP Transfer: పలువురు ఏసీపీ ల బదిలీ
- Advertisment -