- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జనత న్యూస్: ‘ప్రజావాణి’లో అధికారులు తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 212 మంది నుండి అర్జీ లను స్వీకరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కన్నం వెంకటయ్య సర్వే నెంబర్ 714 లోని తన భూమిని ఆక్రమించుకున్నారని దానిని ఇప్పించాలని, మంకొండూర్ మండలం ఊటూర్ గ్రామానికి చెందిన రాజయ్య పెన్షన్ మంజూరి కై, చొప్పదండి మండలం కేంద్రానికి చెందిన శారదా మరుగుదొడ్డి మంజూరు అయినది కానీ డబ్బులు ఇవ్వడం లేదని బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన శంకరయ్య ఆటో ఫైనాన్స్ వారు డబ్బులు చెల్లించిప్పటికి తన ఆటో తీసుకోని వెళ్లారని దరఖాస్తు చేసుకోగ సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 212 ఫిర్యాదులను స్వీకరించగా అందులో పోలీస్ కమిషనర్ కార్యాలయానికి 7, కరీంనగర్ మున్సిపల్ కార్యాలయానికి 34, డిఇఓ కు 6, జిల్లా వ్యవసాయ అధికారి 3, ఆర్డిఓ కరీంనగర్ 18, కరీంనగర్ రూరల్ తహాసీల్దార్ కార్యాలయానికి 11, కొత్తపల్లి తహసిల్దార్ కు 10 ఫిర్యాదులు రాగా మిగిలిన శాఖలన్నింటికి కలిసి 123p ఫిర్యాదులను స్వీకరించడం జరిగిందని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఆర్డిఓ మహేశ్వర్,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.