Akkineni Nagarjuna : సీనియర్ హీరో నాగార్జున హిట్టు, ఫట్టుతో సంబంధం లేకుండా సినిమాల్లో జోరు చూపిస్తున్నాడు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. తాజాగా నాగార్జున గురించి ఓ హాట్ టాపిక్ చక్కర్లు కొడుతోంది. దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నాగార్జున నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అయితే దీనిపై అటు రాజమౌళి గానీ.. ఇటు అక్కినేని గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రాజమౌళి సినిమాలో నాగార్జున కనిపిస్తే అదిరిపోతుందని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల తీసే ధారావి లో నటిస్తున్నాడు. ఇందులో ధనుష్ హీరో అన్న విషయం తెలిసింది. ఈ సినిమా తరువాత రాజమౌళి సినిమా కోసం పనిచేయనున్నట్లు చర్చించుకుంటున్నారు.
Akkineni Nagarjuna : రాజమౌళి సినిమాలో నాగార్జున?
- Advertisment -