వచ్చే ఎన్నికల్లో భాగంగా పొత్తులపై చర్చలు సాగుతున్నాయని, ఈ సమయంలో నాయకుల గురించి బావోద్వేగ వ్యాఖ్యలు చేయొద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాజాగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పొత్తులపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే పార్టీ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అంతేగానీ ఈ సమయంలో ఎలాంటి అనవసర వ్యాఖ్యలు చేయొద్దని పార్టీ నాయకులకు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొనే పొత్తులు పెట్టుకుంటుున్నామని, ప్రస్తుతం ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.
పొత్తులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదు: పవన్ కల్యాణ్
- Advertisment -