- పుష్య బహుళ అమావాస్య సందర్భంగా ప్రత్యేకపూజలు
- కోట రాజేశం విజయ, కోట సతీష్ కుమార్ రజనీ ఆధ్వర్యంలో అన్నదానం
- ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
- తరలి వచ్చిన భక్తులు
సిరిసిల్ల, జనతా న్యూస్: గాలం గుట్ట ఆంజనేయ స్వామి జాతర గురువారం అంగరంగవైభవంగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో కొలువైన స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు కోర్కెలు తీరుస్తూ.. ఆపద్భాంధవుడిగా నిలుస్తున్న స్వామివారికి మాఘ అమావాస్య సందర్భంగా గురువారం ఆలయ కమిటీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ముందుగా చందనం కార్యక్రమం నిర్వహించి ఆ తరువాత పుష్పాభిషేకం నిర్వహిచారు. ఆహ్లదకరమైన వాతావారణంలో కొలువైన ఆంజనేయ స్వామిని ఒక్కసారి దర్శిస్తే అంతా మంచే జరుగుతుందని అంటున్నారు. గాలం గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతీ పుష్య బహుళ అమావాస్య రోజున ప్రత్యేక పూజలు చేసి జాతరను నిర్వహిస్తారు.
ఈ జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తారు. కొందరు ఇప్పటికే దర్శించిన వారు తమ కోర్కెలు తీరిన తరువాత ఇక్కడి వచ్చి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 2024 ఫిబ్రవరి 9న ఈ ఆలయంలో కోట రాజేశం విజయ, కోట సతీష్ కుమార్ రజనీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. స్వామి కృప తమకు ఎప్పుడూ ఉంటుందని వారు ఈ సందర్భంగా తెలిపారు.
జాతర కార్యక్రమంలో ZPtc లక్ష్మణ్ రావు, సెస్ డైరెక్టర్ కృష్ణ హరి, ఎంపీటీసీ లయాగల శ్రీనివాస్ రెడ్డి, మండల నాయకుడు జబ్బార్, బ్లాక్ కాంగ్రెస్ దొమ్మాటి నర్సయ్య , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సర్పంచ్ దేవారెడ్డి, గోగూరి శ్రీనివాస్ రెడ్డి, విద్యా కమిటీ అధ్యక్షులు దేవయ్య, బీజేపీ నేత శ్రీశైలం పయ్యావుల రామచంద్రం, ఆలయ కమిటీ చైర్మన్ పొన్నవేణి రాజు, వార్డ్ మెన్వర్ పాటి దేవయ్యలు ఉన్నారు.కాగా ప్రముఖ వ్యాపారవేత్త కోట సతీష్ కుమార్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు.
500 సంవత్సరాల క్రితం నుంచి ఉంది.
.రాచర్ల విద్యాసాగర్ శర్మ, పురోహితులు, రాచర్ల గొల్లపల్లి
రాచర్ల గొల్లపల్లి లోని ఆంజనేయ స్వామి ఆలయం 500 సంవత్సరాల క్రితం రుషులచే స్థాపించబడింది. అప్పటి నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రతీ మంగళ, శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తాం. పుష్య బహుళ అమావాస్య సందర్భంగా స్వామివారికి చందన అలంకరణ చేస్తాం. ఆ తరువాత పుష్పాభిషేకం నిర్వహిస్తాం.