హైదరాబాద్, జనత న్యూస్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు మొదయల్యాయని ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 3 నుంచి 4 గంటల పాటు విద్యుత్ కోతలు మొదలయ్యాయని అన్నారు. విద్యుత్ సంస్థల్లో ఏపీ వాళ్లను డైరెక్టర్లుగా నియమించారని అన్నారు. గతంలో సలహాదారులే వద్దన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీకి అడ్వైజర్ గా ఏపీకి చెందిన వ్యక్తి ఎందుకని అన్నారు. రాష్ట్ర గీతం గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం హస్యాస్పదంగా ఉందని అన్నారు. టీపీఎస్ సీ చైర్మన్ గా ఉన్న మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ఆయన తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని అన్నారు.
రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి :కవిత
- Advertisment -