భారత్ బౌలర్ బూమ్రా అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకుల్లో నెంబర్ 1 గా నిలిచాడు. భారత్ నుంచి ఐసీసీ ర్యాంకుల్లో పేసర్ నిలవడం ఇదే మొదటిసారి. ఐసీసీ ర్యాంకింగ్ లో బూమ్రాకు881 పాయింట్లు రాగా.. కగిసో రబాడ 851 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న అశ్విన్ 841 తో నాలుగో స్థానంలోకి వెల్లాడు. బ్యాటింగ్ విభాగంలో న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్స్ 864 పాయింట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. భారత్ నుంచి విరాట్ కోహ్లి 760 పాయింట్లు సాధించి 7వ స్థానంలో నిలిచాడు. ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ లు ఉండడం విశేషం.
బౌలింగ్ హీరో బూమ్రా.. ఐసీసీలో నెంబర్ 1 ర్యాంక్
- Advertisment -