U19 World Cup:భారత్ కుర్రాళ్లు ఇరగదీశారు. అండర్ 19 వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి విజయానికి అడుగు దూరంలో నిలిచారు. మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమిస్ లో 2 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా లక్ష్యానికి చేరుకోవడానికి తడబడినా ఆ తరువాత విజయటపు అంచుల్లోకి చేరింది. ఇందుకు కారణం కెప్టెన్ ఉదయ్ సహరణ్ కృషి ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా భారత్ అండర్ 19 వరల్డ్ కప్ కెప్టెన్ ఉదయ్ సహరన్ స్పందించారు. గ్రీస్ లో అడుగుపెట్టినప్పుడు చివరి వరకు ఆడాలని నిర్ణయించుకున్నాఈ మ్యాచ్ లో నేను కొట్టింది 4 ఫోర్లే.. కానీ క్రికెటర్ గా వ్యక్తిగతంగా సాధించానని అనుకుంటున్నా.. నాకు బ్యాటింగ్ వచ్చే సరికి బంతి ఎక్కువగా బౌన్స్ అవుతుంది. అందుకే తొలుత సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోయా.. కొన్ని రోజుల తరువాత మెళకువలు నేర్చుకున్నాను… అని తెలిపాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఉదయ్ 171 పరుగులు చేశారు. నాలుగు పరుగుల దూరంలో పెవిలియన్ కు చేరాడు.
అండర్ 19 టీం ఫైనల్ కు వెళ్లడంపై కెప్టెన్ స్పందన
- Advertisment -