మానకొండూర్, జనత న్యూస్:కరీంనగర్ జిల్లా మానకొండూర్ లో భయభ్రాంతులకు గురి చేసిన ఎలుగుబంటి మొత్తానికి అటవీ అధికారుల వలలో చిక్కింది. ఇక్కడ ఎలుగుబంటి సంచరిస్తుందని తెలియడంతో ప్రజలు ఆందోళన చెందారు. అయితే అటవీశాఖకు సమాచారం తెలియగానే వరంగల్ నుంచి ప్రత్యేక అధికారులను రప్పించారు. మంగళవారం ఉదయం చెట్టెక్కి కూర్చున్న ఎలుగుబంటిని బంధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ముందుగా మత్తు మందు ఇవ్వగా తప్పించుకుంది. చివరికి ఎలుగుబంటి చుట్టూ భారీ వలలు వేసి ఎట్టకేలకే బంధించారు.
Manakondur : ఆపరేషన్ ఎలుగుబంటి సక్సెస్..
- Advertisment -