వేములవాడ, జనత న్యూస్ : సమ్మక్క, సాలరమ్మ జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మేడారం వెళ్లాలనుకునేవారు ముందుగా వేములవాడను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో తెలంగాణనుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఫిబ్రవరి 7 బుధవారం నుంచి అభిషేకాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా మంగళవారం ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు
- Advertisment -