జమ్మూ కాశ్మీర్ లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. చాలా కాలం తరువాత ఇంతటి మంచు కురవడంతో ఇక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదిస్తున్నాయి. ఇక్కడున్న రోడ్లు, ఇళ్లు, చెట్లు వాహనాలను భారీగా మంచు కప్పేసింది. కాశ్మీర్ లోని గుల్మార్గ్ లో మంచుకురిసిన అందాలు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయి. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయాయి. ప్రస్తుతం మైనస్ 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రెండు రోజులగా భారీగా మంచు కురవడంతో గుల్మార్గ్ లో 7.0 డిగ్రీల సెల్సియస్ కు మారిపోయాయి. ఈ నేపథ్యంలో సాధారణ జన జీవనం కష్టంగా మారింది. రోడ్లపై మంచు గడ్డలు ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అయితే రోడ్లపై పేరుకుపోయిన మంచును అధికారులు ఎప్పటికప్పుడు తీసివేయిస్తున్నారు. రాబోయే 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు హెచ్చరిస్తున్నారు.
#WATCH | J&K's Gulmarg covered in a thick blanket of snow as snowfall continues in the region.
(Drone visuals from Gulmarg) pic.twitter.com/gQzB9WT8Pe
— ANI (@ANI) February 4, 2024