Friday, January 23, 2026

‘అమ్మ ఒడి’ ట్రైలర్‌కి అద్భుతమైన రెస్సాన్స్‌..

సినీనటి జ్యోతిక ప్రధాన పాత్రలో ఎస్ వై గౌతమ్ రాజ్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాష్ ఎస్ ఆర్ ప్రభు నిర్మించిన తమిళ చిత్రం రాక్షసి. ఐదేళ్ల క్రితం తమిళనాట విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాని తెలుగులో అమ్మ ఒడి పేరుతో విడుదల చేస్తున్నారు. వడ్డి రామానుజం, వల్లెం శేషారెడ్డి ఈ చిత్రాన్ని ఏపీ, తెలంగాణలో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా సోమవారంనాడు తెలుగు ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చే టీచర్ గా జ్యోతిక కనిపిస్తారు. పాడైపోయిన స్కూళ్లను.. పునరుద్దించాలనుకునే పాత్రలో జ్యోతిక నటించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించే వారికి ఆమె ఒక రాక్షసి అంటూ జ్యోతిక పాత్రను పరిచయం చేయడం సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. నాగినీడు హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ సందర్భంగా వడ్డి రామానుజమ్, వల్లెం శేషారెడ్డి మాట్లాడుతూ..”తెలుగు ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది. తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగులోనూ సక్సెస్ సాధిస్తుందని నమ్మకం ఉందన్నారు. విద్యా వ్యవస్థలోని లోటుపాట్లను చూపించేలా ఈ చిత్రాన్ని దర్శకుడు గౌతమ్ రాజ్ అద్భుతంగా తెరకు రూపొందించారు. డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని వారు తెలిపారు.

నటీనటులు : జ్యోతిక, నాగినీడు, హరీష్ పేరడీ, పూర్ణిమ భాగ్యరాజ్, సత్యన్.
మాటలు, పాటలు : భారతి బాబు పి
దర్శకులు : ఎస్ వై గౌతమ్ రాజ్
బ్యానర్ : డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు : ఎస్ ఆర్ ప్రకాష్, ఎస్ ఆర్ ప్రభు,
వడ్డి రామానుజం వల్లెం శేషారెడ్డి
పి ఆర్ ఓ : హర్షవర్ధన్

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page