Gold Price : కొన్ని రోజులుగా పెరిగిన బంగారం ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. గత రెండు రోజులుగా రూ.300 మేర తగ్గింది. ప్రస్తుతం శుభకార్యాలు లేనందున కొనుగోలు శక్తి పడిపోయిందని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం అంతర్జాతీయంగా వచ్చిన మార్పులే కారణమని అంటున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్స్ కు 2027 డాలర్లు ఉంది. అలాగే సిల్వర్ ఔన్స్ కు 22.34 వద్ద ట్రేడ్ అవుతోంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గాయి. దేశవ్యాప్తంగా మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,950 గా నమోదైంది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ కు 63,220 గా ఉంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. మంగళవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.75,200గా నమోదైంది. అయితే పుష్యమాసం పూర్తయిన తరువాత శుభకార్యాలు జోరుగా ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు దారులు ఇదే మంచి సమయం అని ముందే కొనుగోలు చేస్తున్నారు.
Gold Price : భారీగా పడిపోయిన బంగారం ధరలు..
- Advertisment -