విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆమె సోమవారం అనంతపురం జిల్లాకు వెళ్లాల్సి ఉండగా తన పర్యటనను వాయిదా వేసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొన్ని రోజులుగా తీరిక లేకుండా షర్మిల పార్టీ కార్యక్రమంలో బిజీగా పాల్గొంటున్నారు. దీంతో ఆమెకు వైరల్ ఫీవర్ వచ్చినట్లు పార్టీ నాయకులు తెలిపారు.అనంతపురం జిల్లా మడకశిరలో సోమవారం పాల్గొనాల్సి ఉంది. మంగళవారం ఇదే జిల్లాలోని సింగన నియోజకవర్గం నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో సమావేశం లో పాల్గొనాల్సి ఉండేది. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత పర్యటన తేదీని ఖరారు చేస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తెలుపుతున్నారు.
Ys Sharmula: వైఎస్ షర్మిలకు అనారోగ్యం..
- Advertisment -