రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని డెహత్ జిల్లా.. సికంద్రా పోలీస్ స్టేషన్ పరిధిలో జగన్నాథ్ గ్రామ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు నీటి గుంటలో పడిపోయింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. వర్షం కారణంగా అక్కడక్కడ గుంతలు నీటితో నిండాయి. అయితే వాహనదారుడు నీటి గుంతలను గమనించకపోవడంతో అదుపుతప్పి పడిపోయినట్లు తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Road Accident : రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి
- Advertisment -