Friday, September 12, 2025

మహేష్ రెడ్డి సేవలకు అత్యుత్తమ గుర్తింపు

  • ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు ప్రదానం
  • మాజీ సుప్రీం సీజే కే.జీ.బాలకృష్ణన్ చేతుల మీదుగా పురస్కారం
  • గతంలో మహేష్ రెడ్డిని వరించిన ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డు
  • దేశంలోని పలు దేవాలయాల అభివృద్ధికి విరాళాలు
  • కరోనా విపత్తులోనూ పేదోడికి చేయూత
  • మైనింగ్ వ్యాపారంలోనే కాదు మానవ సేవలోనూ తన మార్క్ ను..
  • చూపించుకుంటున్న పారిశ్రామిక దిగ్గజం,తెలంగాణ బిడ్డ

జనతా న్యూస్ ,హైదరాబాద్: మానవ సేవే మాధవ సేవంటారు. మనసు పెట్టి ప్రజలకు సేవ చేయాలే కానీ..ఆ దేవుడి ఆశీస్సులు తప్పక ప్రాప్తిస్తాయంటారు పెద్దలు. మనం ఏ రంగంలో ఉన్నా..సరే పబ్లిక్ పట్ల ఆపద్బాందవుడిగా ఉంటే చాలు మన కీర్తి,ప్రతిష్టలు అమాంతం పెరిగిపోతుంటాయి. సరిగ్గా ఇలాగే చాన్నాళ్లుగా పేద ప్రజలకు చేయూత,దేవాలయాలకు విశేష సేవలందిస్తున్న మైనింగ్ పారిశ్రామిక దిగ్గజం,ఏఎంఆర్ సంస్థ ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఏ.మహేష్ రెడ్డి,మన తెలంగాణ బిడ్డకు ఇప్పుడు ఆ భగవంతుడి ఆశీస్సులతో అత్యుత్తమ పురస్కారం దక్కడం విశేషం. సాంఘిక,సంక్షేమ,సామాజిక రంగాల్లో విశేష సేవలందించిన మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు దక్కడం రియల్లీ గ్రేట్.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహేష్ రెడ్డి ఈ అవార్డును మాజీ సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి కే.జీ.బాలకృష్ణన్ చేతుల మీదుగా అందుకున్నారు. ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ లో ఫార్మర్ చీఫ్ జస్టిస్ బాలకృష్ణన్ ఆయనకు ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డును ప్రదానం చేశారు. మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్తకు ఇలాంటి అత్యుత్తమ పురస్కారం లభించడం పట్ల హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఏఎంఆర్ గ్రూప్ అధినేతగా మహేష్ రెడ్డి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరును సంపాదించగల్గారు. వ్యాపారాన్ని మొదలుపెట్టిన అతికొద్ది కాలంలోనే ఆయన ఉన్నత యువ వ్యాపారవేత్తగా ఎదిగారు. తన స్వయం కృషితో ఇవాళ మహేష్ రెడ్డి దేశంలోనే నెంబర్-1 మైనింగ్ వ్యాపారవేత్తగా ఎదగగల్గారు. మహేష్ రెడ్డి వ్యాపారంలోనే కాదు..సామాజిక,ప్రజా,సంక్షేమ రంగాల్లో ఆయన చేస్తున్న సేవలు ఆయనను అత్యుత్తమ స్థాయిలో నిలబెట్టాయి. ప్రస్తుతం ఆయన కంపెనీలో 5000 మంది పనిచేస్తున్నారు. రానున్న కాలంలో సుమారు లక్ష మందికి తన కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ఆయన ముందుకెళుతుండడం విశేషం.

దేవాలయాలకు విశేషంగా విరాళాలు

పారిశ్రామివేత్తగా విశేష గుర్తింపు తెచ్చుకున్న మహేష్ రెడ్డి దేశంలోని ప్రముఖ దేవాలయాలకు విశేషంగా విరాళాలు అందజేసి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. షిరిడి సాయినాధున్ని ఎల్లప్పుడూ కొలిచే భక్తునిగా షిరిడీలోని మందిరానికి బంగారు సింహాసనాన్ని బహుకరించారు. అలాగే ఏపీతో పాటు దేశ వ్యాప్తంగా తన స్వంత ఖర్చులతో పలుచోట్ల దైవ మందిరాలను కట్టించారు. శ్రీశైలం,కాణిపాకం, నెల్లూరులోని రామతీర్థం,శ్రీ రాజరాజేశ్వర టెంపుల్,శ్రీ పృద్వేశ్వర ఆలయం వంటి దేవాలయాలకు తన స్వంత ఖర్చులతో మరమ్మతులు చేయించారు. అదేవిధంగా అయోధ్య శ్రీ రామ జన్మభూమికి రూ.కోటి విరాళం అందించారు. సాయిబాబా సనాతన ట్రస్ట్ షిరిడికి 148 కేజీల బంగారాన్నివిరాళంగా అందజేశారు. గతంలో సాయి ప్రేరణ ట్రస్ట్ కు సంబంధించి సాయి తత్వాన్ని బోధించే సేవలను చేయించారు. ఇందుకుగాను మహేష్ రెడ్డికి ‘మాలిక్ ఏక్ సుర్ అనేక్’ అవార్డుతో ఆయనను సత్కరించారు.

కోవిడ్ విపత్తులో బహుముఖ సేవలు

మరోవైపు దేశ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి వికటహాసం చేస్తుంటే..పేద ప్రజలను ఆదుకునేందుకు తన వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలకు చెరో రూ.కోటిని విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో అనేక హెల్త్ క్యాంపులు పెట్టి పేద ప్రజలను అక్కున చేర్చుకున్నారు. వారికి అవసరమైన ఆరోగ్య సేవా కార్యక్రమాలను కొనసాగించారు. నిత్యవసర వస్తువులను పంపిణీ చేసి కష్టకాలంలో తన వంతుగా వారి పొట్ట నింపే ప్రయత్నాలు చేశారు. ఇక ఆయన సామాజిక సేవా కార్యక్రమాలే కాదు ఏఎంఆర్ ప్రొడక్షన్స్ ద్వారా భక్తితత్వాన్ని బోధించే విధంగా రెండు తెలుగు సినిమాలను తెరకెక్కించి ఔరా అనిపించారు. అందుకే కాబోలు ఆ భగవంతుడి ఆశీస్సులతో సక్సెస్ కు మారుపేరైన మహేష్ రెడ్డికి ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ 2024 అవార్డు దక్కడం రియల్లీ గ్రేటనే చెప్పాలి. తెలంగాణ బిడ్డకు ఈస్థాయి గుర్తింపు దక్కడం గొప్ప విషయమే మరి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page