Wednesday, March 11, 2026

కోరుట్ల : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిక

కోరుట్ల, జనవరి 29 (జనతా న్యూస్ ):కోరుట్ల బీఆర్ఎస్ మైనారిటీ నాయకుడు మహ్మద్ అజీముద్దీన్ ఈరోజు తన 100 మందికి పైగా మద్దతుదారులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈరోజు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి జె.నర్సింగ్ రావును కలిసిన అజీముద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆయనతో పాటు 100 మంది యువకులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.కాంగ్రెస్ లో చేరారు. అజీముద్దీన్ కోరుట్ల మామిడి వ్యాపారుల సంఘం అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు నర్సింగ రావు పేర్కొన్నారు.ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు, మాట్లాడుతూ రాజకీయాలు చేయడానికి దేవున్ని కూడా వదలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ద్వారాలు తెరచి పెడితే బారాసా లో కెసిఆర్ కుటుంబ సభ్యులు కేవలం ముగ్గురే మిగిలిపోతారని కానీ ఇలాంటి దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయబోదని పేర్కొన్నారు. త్వరలో త్వరలో నియోజకవర్గంలో మున్సిపాలిటీలలో జరిగిన అవినీతి ద్వారా మున్సిపల్ పాలకవర్గం అవిశ్వాసం ఏర్పాటు చేసి అభివృద్ధి దిశగా కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఎన్నిక అవుతారని స్పష్టం చేశారు.ఎవరైనా కర్మ సిద్ధాంతం నుండి తప్పించుకోలేరని 15 సంవత్సరాలలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన బారాస నాయకుల అవినీతిచిట్ట విప్పుతామని స్పష్టం చేశారు.బారాస చిన్నస్థాయి కార్యకర్త నుండి ఎమ్మెల్యే వరకు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడి అక్రమంగా ప్రజాధనం ఇసుక మాఫియా తో కోట్లు గడిచారని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తో పాటు కోరుట్ల నియోజకవర్గంలో జువ్వాడి రత్నాకర్ రావు చేసిన అభివృద్దే కానీ గత 15 సంవత్సరాల నుండి కోరుట్ల నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. అర్హులైన పేద వారందరికీ అన్ని రకాల సంక్షేమ పథకాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు కృష్ణారావు కోరుట్ల పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మహిళా పట్టణ అధ్యక్షురాలు మచ్చ కవిత, మాజీ కౌన్సిలర్ సోగ్రబి,ఉపాధ్యక్షులు నయీమ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉరుమడ్ల వెంకటి, నేమురి భూమయ్య, ఆడెపు మధు,ఎంబెరి భూషణ్, సత్యనారాయణ,చెదలు సత్యనారాయణ, అమరేందర్,పేట భాస్కర్ సంఘ లింగం, రంజిత్,మాసాపురం వెంకటేశ్వర్లు,మ్యాదరి లక్ష్మణ్,రాజేష్ తదితరులు ఉన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page