Saturday, March 14, 2026

వేసవిలో గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు

  • రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, జనతా న్యూస్: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.ఆదివారం చిగురుమాడి మండలంలో పలు గ్రామాల్లో నూతన గ్రామపంచాయతీ భవనాలకు ప్రారంభోత్సవాలు, సీసీ రోడ్లకు, పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపలు చేశారు. సీతారాంపూర్ గ్రామంలో రూ 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించి అనంతరం రూ 5కోట్ల వ్యయంతో సీతారాంపూర్ నుండి పర్లపల్లి వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు, రూ 1.60 కోట్లతో రామంచ నుండి ముదిమాణిక్యం వరకు నిర్మించబోయే పంచాయతి రాజ్ రోడ్డుకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ 20 లక్షల రూపాయల వ్యయంతో గునుకుల పల్లె గ్రామంలో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాని కీ ప్రారంభోత్సవం, ఇందుర్తి నుండి ఓబులాపూర్ వరకురూ కోటి 60 లక్షలతో నిర్మించబోయే రోడ్డు పనులకు శంకుస్థాపన, చిన్న మూల్కనూరులో రూ 5 లక్షలతో నిర్మించనున్న యాదవ సంఘ భవనానికి శంకుస్థాపన, ఇందుర్తి గ్రామంలో పల్లె దవాఖాన భవనమును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ది అనేది నిరంతర ప్రక్రియ అని, గత5 సంవత్సరాలుగా గ్రామాల అభివృద్ధికి సర్పంచులు పడ్డ కష్టానికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి సర్పంచ్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా గ్రామాన్ని పట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా పని చేశారన్నారు. వచ్చే వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటమని మంత్రి తెలిపారు. ఏ బంధువులు ఉన్నా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని మంత్రి సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,ఆర్డిఓ మహేశ్వర్, ఇంచార్జ్ జిల్లా పంచాయతీ అధికారి పవన్ కుమార్, ఎంపీపీ కె వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పిటిసి గీకురు రవీందర్రావు, పంచాయతీ రాజ్ డి ఈఈ రవి ప్రసాద్, తాహసిల్దార్ నరేందర్, ఎంపీడీవో నరసయ్య, ఆయా గ్రామాల సర్పంచ్ లు,ఎంపీటీసీలు ప్రతినిధులు, వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page