కరీంనగర్, జనతా న్యూస్:రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 18 సంవత్సరాలు నిండిన నూతన ఓటర్లు మరియు అర్హులైన ఓటర్లందరు వారి ఓటుహక్కును వినియోగించుకుని రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచడం కొరకు రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి స్వీప్ యాక్టివిటి క్యాలెండర్-2024 ను రూపొందించారని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 26 నుండి 3 నెలల కొరకు జిల్లాలోని నాలుగు నియోజక వర్గాలలో స్వీప్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు జనవరి 27 నుండి ఎప్రిల్ 15 వరకు బూత్ స్థాయి సమావేశాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పనిచేస్తున్న వారితో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియెషన్/గేటెడ్ కమ్యూనిటిలు, యువకులు, మహిళలు, థర్థ్ జండర్ లు, పిడబ్ల్యుడి మరియు సీనియర్ సిటిజన్ లు, మొదలైన వారితో స్వీప్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించుటకు షెడ్యూల్ ను రూపొందించడంతో పాటు, కార్యక్రమాలను విజయంతం చేయడానికి ప్రత్యేక అధికారులను కూడా కేటాయించడం జరిగిందని పేర్కోన్నారు. జనవరి 27 నుండి ఫిబ్రవరి 5 వరకు గ్రామసభలు, వివిధ శాఖల ద్వారా ఓటర్ అవేర్నెస్, ఫిబ్రవరి 1 నుండి మార్చి 15 వరకు అన్ని మున్సిపాలిటీలు, మండల హెడ్ క్వార్టర్లలో ఆర్డబ్ల్యూఏ ప్రెసిడెంట్స్, గేటెడ్ కమ్యూనిటీ ఓటర్ ఎన్రోల్మెంట్, ఫిబ్రవరి 8న మండల కేంద్రాల్లో 2కె రన్, ఫిబ్రవరి 16న మున్సిపాలిటీలలో 2కె రన్, ఫిబ్రవరి 23న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో బైక్, సైకిల్ ర్యాలీ, 29న కైట్ ఫెస్టివల్, ఫిబ్రవరి 6 నుండి 29 వరకు స్పెషల్ ఎస్ హెచ్ జి మీటింగ్స్,సమైక్య, మండల సమైక్య వివో మీటింగ్స్, ఏఎల్ ఎఫ్, టీఎల్ఎఫ్ మీటింగులు మార్చ్ 5న అన్ని మండల కేంద్రాల్లో, మార్చ్ 13న అన్ని మున్సిపాలిటీలలో రంగోలి కాంపిటేషన్, ఫిబ్రవరి 1 నుండి ఏప్రిల్ 15 వరకు అన్ని గ్రామ పంచాయతీలు, మండలాలలో, మున్సిపాలిటీలలో ఓటు యొక్క ప్రాముఖ్యత గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు మున్సిపల్ కమిషనర్లు, ఈ ఆర్ ఓ లు, ఏ ఈ ఆర్ వో లు, బి ఎల్ ఓ లు, సూపర్వైజర్లు బిల్ కలెక్టర్లు పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు కలెక్టర్ తెలిపారు.
ఓటింగ్ శాతాన్ని పెంచడానికి’ స్వీప్ ‘: కలెక్టర్ పమేలా
- Advertisment -
