మంథని రూరల్: మంథని, ముత్తారం ఇసుక క్వారీల నుంచి రవాణా అవుతున్న ఇసుక లారీలు, టిప్పర్లను టీఎస్ఎండిసి అధికారులు అకస్మికంగా తనిఖీ చేశారు. మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజుపల్లి వద్ద శనివారం రాత్రి మాటు వేసిన టిఎస్ఎండిసి ఎస్ ఆర్ ఓ లు రాజ్ కుమార్, అరవింద్ ల ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేపట్టారు.. ఈ సందర్భంగా వారు వేబీళ్లులో ఇతర పత్రాలను పరిశీలించారు. రొటీన్ తనిఖీల్లో భాగంగానే ఈ తనిఖీలను చేపట్టినట్లు వారు వివరించారు. వాహనదారులు తప్పనిసరిగా సరైన పత్రాలు భద్రపరచుకోవాలని వారు సూచించారు. అంతేకాకుండా వాహనాలు నడిపేటప్పుడు డ్రైవర్లు జాగ్రత్తగా నడపాలని వివరించారు. ఓవర్ స్పీడ్ ఓవర్టేక్ వంటివి చేయకుండా సురక్షితంగా వాహనాల నడపాలని వారు తెలిపారు. రూల్స్ ను అతిక్రమించిన వారి పైన చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
మంథని : టీఎస్ఎండీసీ అధికారుల తనిఖీలు
- Advertisment -