- బెజ్జంకి మండల కేంద్రగా ప్రధాన రోడ్డు నుండి రవాణా
- చూసి చూడనట్లు ఉంటున్న అధికారులు.
- ఇసుక అక్రమ రవాణా పై కూడా దృష్టి పెట్టాలని ప్రజల విజ్ఞప్తి.
జనత న్యూస్ బెజ్జంకి : గత నాలుగు రోజుల క్రితమే బెజ్జంకి తహసిల్దార్ ఎర్రోళ్ల శ్యామ్ అక్రమంగా మట్టిని తరలిస్తున్న నాలుగు టిప్పలను పట్టుకొని జరిమానా విధించిన సంగతి తెలిసిందే. కానీ మళ్లీ రెండు రోజుల విరామం తర్వాత మండల కేంద్రం ప్రధాన రోడ్డు నుండి మట్టిని తరలిస్తున్న టిప్పర్లు దర్శనమిస్తున్నాయి. దీంతో మండల ప్రజలలో అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి, కాంట్రాక్టర్లతో అధికారులు ఎవరైనా కుమ్మక్కు అయినా రా! లేక పర్యవేక్షణ లోపమా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.ఇలాగే ఇసుక అక్రమ రవాణా కూడా యాద్దెచ్చగా జరుగుతున్నట్లు వినికిడి, ఈ అక్రమ మట్టి తరలింపు, ఇసుక తరలింపులు, ఇసుక అక్రమ డంపులపై అధికారులు దృష్టి పెట్టాలని ఈ దందాలు ఇలానే కొనసాగితే అధికారులను ప్రజలు అనుమానించే పరిస్థితి ఉంటుందని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు.
