Saturday, March 14, 2026

జనరల్ సెక్రెటరీగా శరత్ కుమార్ నియామకం

జనతా న్యూస్ బెజ్జంకి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం చిలాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు శనగొండ శరత్ కుమార్ ని గురువారం మానకొండూర్ నియోజకవర్గ ఉద్యమకారుల ఫోరం జనరల్ సెక్రెటరీగా నియమిస్తూ, కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం చైర్మన్ కనకం కుమారస్వామి నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శరత్ కుమార్ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ నియోజకవర్గ ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాస్ కు, జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page