మానకొండూరు నియోజకవర్గం, జనతా న్యూస్:తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించి జాయింట్ యాక్షన్ కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరించిన ప్రొఫెసర్ కోదండరాం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక అయ్యారు. ఆయన కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలం ఊటూరు గ్రామంలో ఐదు సెప్టెంబర్ 1955లో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు అనంతరం హైదరాబాదులో ఉన్నత విద్యను అభ్యసించి ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర ఆచార్యుడిగా పనిచేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి ముఖ్యంగా మానకొండూరు నియోజకవర్గం వాసి అయిన కోదండరాం ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో పలువురు మేధావులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ కోదండరాం కరీంనగర్ జిల్లావాసుడే..
- Advertisment -
