దేశంలో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగురవేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా ప్రతీ జెండా పండుగను దేశంలోని ఎర్రకోటా వద్ద నిర్వహించే విషయం తెలిసిందే. ఇక్కడ దేశంలోని సాంప్రదయాలు విశేసాలు చెప్పే షకటాలు, విన్యాసాలు ప్రదర్శిస్తారు. ఇవే వెళ్లే రోడ్డును ‘కర్తవ్యపథ్’ అని పిలుస్తారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడే వేడుకలను నిర్వహిస్తున్నారు. అయితే 1911 కంటే ముందు ఈ వేడుకలు కలకత్తాలో నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ కేంద్రంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడే కొనసాగుతున్న ‘కర్తవ్యపథ్’ గురించి..
దేశానికి కేంద్ర బిందువుగా నిలిచే కర్తవ్య పథ్ రోడ్డు 3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. కొత్త పార్లమెంట్ ను నిర్మించే సమయంలో కర్తవ్య పథ్ ను అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా కొన్ని రోజుల పాటు ఇక్కడికి సామన్య ప్రజలను అనుమతించలేదు.కానీ ఈసారి గణతంత్ర వేడుకలను ఇక్కడే చూడొచ్చు. రాజధాని కొల్ కతా నుంచి ఢిల్లీకి మారిన తరువాత ముందుగా దీనికి కింగ్స్ వే అని పేరు పెట్టారు. ఆ తరువాత రాజ్ పథ్ అని పెట్టారు. ప్రస్తుతం కర్తవ్య పథ్ గా పిలుస్తున్నారు. కర్తవ్య పథ్ రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు విస్తరించి ఉంది.