కోరుట్ల,జనవరి 24 (జనతా న్యూస్): కోరుట్ల పట్టణంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం అలాగే అప్పటి దేవదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో నిర్మితమైనటువంటిటి టి డి కళ్యాణమండపం అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ కు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు ఈరోజు వినతిపత్రం అందజేశారు జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి దర్శనర్థం ఈరోజు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుతో కలిసి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ రాగ ఈ వినతి పత్రం అందజేసి త్వరలో నిధులు విడుదల చేయాలని కోరినట్లు జువ్వాడి నరసింగారావు తెలిపారు నరసింగరావు వెంట కోరుట్ల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ ఉపాధ్యక్షులు ఎం ఏ నయిం కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ సదుల, వెంకటస్వామి వసిద్, అమరేందర్,నేమూరి భూమయ్య, సంతోష్ రావు, అయిండ్ల గణేష్ విరవత్రిని దశరథం తునికి సాయి తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల : ఆలయ అభివృద్ధి నిధుల కోసం మంత్రికి వినతి
- Advertisment -