మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్: భక్తిశ్రద్ధలతో ఆధ్యాత్మికతను అలవర్చుకుంటే ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు అని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హన్మండ్ల భాస్కర్ అన్నారు. గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్ లో ఈనెల 22న అయోధ్యలో జరిగిన బాలరాముడి ప్రాణవిగ్ర ప్రతిష్ట లో భాగంగా గునుకుల కొండాపూర్ హనుమాన్ గుడిలో అఖండ రామ నామ సంకీర్తనలతో పాటు సుమారుగా 1200 మందికి అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ రామ భక్తులను బుధవారం అభినందించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం హన్మండ్ల భాస్కర్ మాట్లాడుతూ భక్తి పారవశ్యం ఉన్నవారు క్రమశిక్షణతో మెలుగుతారని సన్మా ర్గంలో నడుస్తారని అన్నారు. అనంతరం ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చిన గుండ్లపల్లి సర్పంచ్ బేతేల్లి సమత రాజేందర్ రెడ్డిలను, గునుకుల కొండాపూర్ భక్త బృందంతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సమత రాజేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కొరివి తిరుపతి, భక్తులు లింగంపల్లి సమ్మయ్య, అనుమండ్ల నర్సయ్య, గునుకుల ప్రభాకర్ రెడ్డి, నాగపురి శంకర్, న్యాలపట్ల లక్ష్మణ్, పర్ల రాజు, దొమ్మటి శంకర్, బోయిన సమ్మయ్య, గూడెల్లి మల్లేశం, న్యాలపట్ల పట్ల రవి, బోయినీ బొందయ్య, ఆలయ పూజారి కనపర్తి శేఖరాచార్యులు తదితరులు పాల్గొన్నారు
అన్నదానం నిర్వాహకులకు సన్మానం
- Advertisment -
