కోరుట్ల, జనవరి 23 (జనతా న్యూస్ ):కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై గల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి కొబ్బరికాయలు కొట్టి స్వీట్లు పంపిణీ చేసిజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఇట్టి కార్యక్రమం నేతాజీ క్లబ్ ప్రధాన కార్యదర్శి గడ్డం మధు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం అనిల్ ,రుద్ర శ్రీనివాస్ ,కౌన్సిలర్స్ ఎంబేరి నాగభూషణం, గంధం గంగాధర్ , జిందం లక్ష్మీనారాయణ ,మోర్తాడ్ లక్ష్మీనారాయణ ,పుప్పాల ప్రభాకర్ ,గుడ్ల మనోహర్ ,రాంబోల్ సత్యపాల్, శ్రీరాముల అమరేందర్,నేతాజీ క్లబ్ సభ్యులు బొల్లాజీ నగేష్ ,బొమ్మ రాజేశం ,భీమనాతి శ్రీధర్,సాయి కృష్ణ ,నల్గొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సుభాష్ చంద్ర బోస్ జయంతి సందర్బంగా బీజేవైఎం అధ్యక్షులు కాలాల సాయి చందు ఆధ్వర్యంలో పూల మాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ ప్రధాన కార్యదర్శి గుండేటి సాయికుమార్ ఉపాధ్యక్షలు ఎడమలపెల్లి సాయికుమార్,కొక్కుల మనోజ్, జిల్లా ఉదయ్, పాతర్ల మణిదీప్, కొమ్ము నవీన్, మణిదీప్, మణికంఠ, దుర్గ ప్రసాద్, లక్ష్మిపాతి పాల్గొన్నారు.