Saturday, March 14, 2026

జాతీయ సమైక్యత శిబిరంలో శాతవాహన విద్యార్థులు

కరీంనగర్, జనతా న్యూస్:శాతవాహన విశ్వవిద్యాలయంలోని ప్రాంగణ కళాశాలైన యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కు చెందిన విద్యార్థులు రాయకంటి వంశీ ఎం కాం ద్వితీయ సంవత్సరం,మంథని సుష్మ ఎంబీఏ ద్వితీయ సంవత్సరం మరియు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ కళాశాలకు చెందిన పి.సంధ్యారాణి ఎం ఏ తెలుగు మొదటి సంవత్సరం విద్యార్థిని కేంద్ర ప్రభుత్వ యువజన కార్యకలాపాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎం ఎల్ ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ వారు ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహించిన జాతీయ సమైక్యత శిబిరంలో పాల్గొన్నారు. ఈ జాతీయ సమైక్యత శిబిరంలో దేశంలోని 12 రాష్ట్రాల నుండి వివిధ యూనివర్సిటీలకు చెందిన ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న శాతవాహన విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రదర్శించి ప్రతిభ కనబరిచారు. ఈ శిక్షణ శిబిరం ముగించుకొని వచ్చిన విద్యార్థులను శాతవాహన విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ సంకశాల మల్లేష్, రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం వరప్రసాద్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ మనోహర్ ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కంచు తిరుపతి, డి.విజయ్ ప్రకాష్ మరియు అధ్యాపకులు అభినందించారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page