Saturday, July 5, 2025

సవాళ్లను అధిగమించి ఆలయ నిర్మాణం

  • మొదటి నుంచి అయోధ్యలో ఆలయ నిర్మాణం కోసం..
    హైందవ సంఘాలు,ఆర్ఎస్ఎస్ ప్రయత్నం
  • 1528లో బాబర్ ఆదేశం మేరకు మీర్ బాకి..
    టెంపుల్ ను కూల్చివేసినట్లు ఆరోపణ
  • హిందూ సంఘాల ఆరోపణలను ఖండించిన ముస్లిం సంఘాలు
  • అద్వానీ రామ్ రథ్ యాత్రతో పెరిగిన టెన్షన్
  • 1992లో బాబ్రీ మసీద్ కూల్చివేత
  • ఏళ్లుగా సుప్రీంకోర్టులో నడిచిన పంచాయతీ
  • 2019లో సుప్రీం కీలక తీర్పు
  • శ్రీరామ జన్మభూమిపై సంపూర్ణ..అధికారం రామ్ లలాకేనని వెల్లడి

అయోధ్యలో రామాలయ నిర్మాణం అనేది ఒక్క రోజులో అయిన తంతు కాదన్న విషయం అందరికీ తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక దఫ,దఫాలుగా ఘర్షణలు జరిగిన సంఘటనలు విధితమే. సరయూ నది ఒడ్డున…కోసల రాజ్యాన్ని శ్రీరామ చంద్రుడు పాలించిన ప్రాంతంలో ఆయన అద్భుతమైన దేవాలయముండేదని..దాన్ని మొఘల్ చక్రవర్తి బాబర్ తన హయాంలో మీర్ బాకీ చేత క్రీ.శ.1528లో ధ్వంసం చేయించి బాబ్రీ మసీదును నిర్మించారని హైందవ సంఘాలు చాన్నాళ్లుగా వాదిస్తూ.. వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అయోధ్య రామాలయ నిర్మాణం కోసం ఎప్పటి నుంచో హైందవ సంఘాలు,సంఘ పరివార్ సంస్థ ప్రయత్నాలు చేస్తున్నాయి.

Babri Masid
Babri Masid

అందులో భాగంగానే హిందు సంఘాలు 1813లో ఒక కీలక ప్రకటన చేశాయి. మందిరాన్ని కూల్చివేసి బాబ్రీ డంచ్ నిర్మాణం చేయబడిందని బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేశారు. దీంతో ఈ ప్రాంతాన్ని వివాదాస్పద స్థలంగా గుర్తించిన బ్రిటిష్ సర్కార్ ఆ ఏరియా చుట్టు కంచెను ఏర్పాటు చేయించింది. ఈనేపథ్యంలోనే ఈ పంచాదీ 1885లో ఫైజాబాద్ జిల్లా న్యాయస్థానానికి చేరింది. అయితే ఈ వ్యవహారం సుదీర్ఘ కాలం పాటు స్తబ్ధుగా ఉన్నప్పటికీ..1949లో బాలరాముడి విగ్రహం బయటపడడం కలకలం రేపింది. ఈనేపథ్యంలోనే 1984లో హైందవ సంఘాలు శ్రీరామ జన్మభూమి విముక్తికై పోరాటం చేయాలని నిర్ణయించాయి. అయితే 1986లో కోర్టు ఇచ్చిన ఆదేశాలతో భక్తులకు రామ్ లలా దర్శన భాగ్యం దొరికింది. 1989లో ఈ రామ్ లలానే ఫైజాబాద్ జిల్లా కోర్టులో తన వ్యాజ్యాన్ని కొనసాగించింది.

L K Advani Ratha Yatra
L K Advani Ratha Yatra

ఇక ఇదిలా ఉండగానే బీజేపీ నేతలు ఎల్.కే.అద్వానీ,మురళి మనోహర్ జోషి,ఉమా భారతిలు చేపట్టిన రామ మందిర ఉద్యమం ఊపందుకుంది. అద్వానీ చేపట్టిన రామ్ రథ యాత్రకు విశేష స్పందన వచ్చింది. నార్త్ ఇండియా మొత్తం రామ జపంతో ఊగిపోయింది. దీంతో అప్పట్లో బీజేపీకి రెండంటే రెండే లోక్ సభ స్థానాలుండగా.. అవి కాస్తా రథయాత్ర వల్ల 90వ దశకంకు చేరుకునే సరికి 89కి చేరుకున్నాయి. ఈనేపథ్యంలోనే అటు పొలిటికల్ సపోర్ట్ దొరకడం,ఇటు హైందవ సంఘాలు పట్టుదలతో ఉండడంతో 1990లో మొదటి కరసేవ జరిగింది. డిసెంబర్ 06,1992 నాటికి కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేయడం జరిగింది. ఇక చివరకు ఈకేసుపై 2019లో 5రుగు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం బెంచ్ హైందవ సంఘాలకు అనుకూలంగా కీలక తీర్పును ఇచ్చింది. శ్రీరామ జన్మ భూమిపై పూర్తి హక్కులు శ్రీ రామ్ లలాకే ఉంటుందని జడ్జ్ మెంట్ పాస్ చేేసింది. దీంతో అయోధ్య రామాలయ నిర్మాణంలో కీలక పురోగతిని హిందూ సంఘాలు సాధించగల్గాయి. ఇక 2020లో భవ్య రామ మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరగడం..ఇవాళ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టా మహోత్సవం జరుగుతుండడంతో..హిందువుల్లో ఎక్కడ లేని ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page