Saturday, March 14, 2026

గ్రామపంచాయతీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలి

  • సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేసి అప్లోడ్ చేయాలి
  • నిర్దేశించిన లక్ష్యం మేరకు హార్టికల్చర్ ప్లాంటేషన్ చేయాలి
  •  అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్

కరీంనగర్, జనతా న్యూస్: సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, మండల పరిషత్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రణాళికలు చేసుకొని నిర్ణీత సమయంలో అప్లోడ్ చేయాలని అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, పంచాయతి రాజ్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు, జూనియర్ ఇంజనీర్ల, పంచాయతీ కార్యదర్శులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ 2023-24 సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం మేరకు హార్టికల్చర్ ప్లాంటేషన్ పూర్తిచేయాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద ప్రతిరోజు ప్రతి గ్రామపంచాయతీలో 50 మంది కూలీలు కచ్చితంగా హాజరు కావాలన్నారు. వ్యవసాయ వ్యవసాయ అనుబంధ, సహజ వనరులు, వ్యక్తిగత పనులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ క్రింద నిర్దేశించిన లక్ష్యం మేరకు నర్సరీలు 100% బ్యాగ్ ఫిల్లింగ్ మరియు విత్తనాలు వేయుపనిని పూర్తి చేయాలన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, మండల పరిషత్ డెవలప్మెంట్ ప్లాన్ నిర్ణీత సమయంలో తయారు చేసి అప్లోడ్ చేయాలన్నారు. ఫిబ్రవరి 2024 లోపు ఇంటి పన్నులు కరెంట్ బిల్లులు వసూళ్లు పూర్తి చేయాలన్నారు. గ్రామపంచాయతీ భవనాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ ఎల్ శ్రీలత, జడ్పీ సీఈవో పవన్ కుమార్, జిఎం ఇండస్ట్రీ నవీన్ కుమార్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ నరేందర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితాదేవి, ఎంపీడీవోలు, ఎంపీ ఓలు, పంచాయతి రాజ్ ఏ ఈ లు,పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page