ఇల్లంతకుంట జనవరి 20 (జనతా న్యూస్) అయోధ్య రామ మందిరంలో ఈనెల 22న బాల రామ ప్రాణ ప్రతిష్ట ఉన్న నేపథ్యంలో ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉన్న వాణి నికేతన్ పాఠశాల విద్యార్థులు శ్రీరామనామ ఆకృతిలో ప్రదర్శన శనివారం నాడు చేశారు ఈ కార్యక్రమం గ్రామస్తులను ఎంతగానో ఆకట్టుకుంది మండలంలో వివిధ గ్రామాల్లో శ్రీరామ అయోధ్య అక్షింతలు కూడా ఇంటింటికి వితరణ చేసే కార్యక్రమం నేటితో పూర్తయింది పాఠశాల విద్యార్థులు శ్రీరామ ఆకృతి చేసిన విధానం పట్ల పాఠశాల కరస్పాండెంట్ టి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులను అభినందించారు విద్యార్థుల తల్లిదండ్రులు తోపాటు ఉపాధ్యాయులు శ్రీనిధి మల్లేశం రాజు రమేష్ శోభ స్వాతి సంతోష్ సునంద మౌనిక రేవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
విద్యార్థుల ప్రదర్శన అద్భుతం..
- Advertisment -
