*మూడు పువ్వులు ఆరు కాయలు లాగా యదేచ్చగా మట్టి దందా!
* బెజ్జంకి ప్రధాన రోడ్డుల నుండి రోజు పదుల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలింపు
* సంబంధిత అధికారులు దృష్టి పెట్టాలని ప్రజల విజ్ఞప్తి.
బుర్ర భూమేష్, జనతా న్యూస్
సిద్దిపేట జిల్లా బెజ్జంకి చిన్నకోడూరు మండలాలలో ప్రభుత్వ భూములు నుంచి అక్రమ మట్టి తరలింపు యదేచ్ఛగా సాగుతుంది. రాత్రి పగలు తేడా లేకుండా మట్టి తరలింపు దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతుంది. ప్రభుత్వ భూముల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా జేసీబీల ద్వారా మట్టి తవ్వకాలు చేసి టిప్పర్ల ద్వారా బెజ్జంకి నడిరోడ్డు నుండి యదేచ్చగా తరలిస్తున్నారు. ప్రభుత్వ భూములతో పాటు సీలింగ్ భూముల నుంచి మట్టి తరలింపు చేస్తూ ప్రైవేట్ వెంచర్‌కు టిప్పర్ల ద్వారా సరఫరా చేస్తూ కొందరు అక్రమంగ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. సీలింగ్ భూముల తో పాటు, గుట్టల్లో అక్రమ ఎర్రమట్టి తరలింపు కార్యక్రమం యదేచ్ఛగా సాగుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
*అనుమతులు ఇలా*
ప్రైవేటు భూముల్లో తవ్వకాలు చేపట్టేందుకు గనులు, భూగర్భ శాఖ జిల్లా ఆఫీసులో అనుమతి పొందాలి. ఇది రెండు రకాలుగా ఉన్నాయి, ముందుగా ఇల్ల నిర్మాణాలకు తక్కువ మొత్తంలో, అవసరమున్నవాటికి తహసిల్దార్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. తర్వాత మీ సేవ ద్వారా గనులు, భూగర్భ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవేవీ పట్టకుండా, అడ్డు అదుపు లేకుండా యదేచ్చంగా, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ సంపాదిస్తున్నారు. ఇకనైనా చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూడాలి.