Thursday, September 11, 2025

ప్రభుత్వ,దళితుల భూమిని అన్యాక్రాంతం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

 

ప్రజా దర్బర్లో ఫిర్యాదు చేసిన ఫైల్ ఫోటో
ప్రజా దర్బర్లో సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన ఫైల్ ఫోటో

– అప్పటి తహసీల్దార్,ఆర్డిఓ ల పై చర్యలు తీసుకోవాలి

– గూడెంలో  జరిగిన భూ అక్రమాలపై ఫోకస్ పెట్టాలి

– ఆర్టీఐ ప్రచార కమిటి చైర్మన్ రాసూరి మల్లిఖార్జున్ ఎమ్మెల్ల్యేకు వినతి

కరీంనగర్, జనతా న్యూస్ : వడ్డించేవాడు మనవాడైతే చివరి బంతిలో కూర్చున్నా ఫర్వాలేదు. అధికారుల అండదండలుంటే ఏదైనా సాధ్యమే. ఈనేపథ్యంలో ప్రభుత్వ భూమిని అప్పనంగా దొబ్బేసి దళితుల నోటికాడి బువ్వ లాక్కున్న వైనంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధికారుల తీరుతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారికి జరిగిన అన్యాయంపై  ఈ మధ్య ఏర్పాటైన కొత్తప్రభుత్వం లోనీ ప్రజా దర్బార్లో మొదటి రోజే సీయం కు ఫిర్యాదు చేశారు . లోకాయుక్తకు సైతం గతంలోనే ఫిర్యాదు చేశారు. కాగా స్థానిక ఎమ్మెల్యే ని కలిసి ప్రభుత్వ,దళితుల భూమిని అన్యాక్రాంతం చేసిన తీరును వివరించినట్లు ఆర్టీఐ ప్రచార కమిటి చైర్మన్ రాసూరి మల్లిఖార్జున్ తెలిపారు.  దీనిపై విచారణ జరిపించి న్యాయం చేయాలని  ఆయన కోరినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

MRO Office ముందు ధర్నా ఫైల్ ఫోటో చిత్రంలో అప్పటి RDO జయచంద్ర రెడ్డి ఉన్నారు
MRO Office ముందు ధర్నా ఫైల్ ఫోటో చిత్రంలో అప్పటి RDO జయచంద్ర రెడ్డి ఉన్నారు

బెజ్జంకి మండలంలోని సర్వే నెంబర్ 961 లో మొత్తం 9.20 ఎకరాల వ్యవసాయ భూమిని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి ఐదుగురు లబ్ధిదారులకు అందజేశారు. అప్పటి నుంచి 2018 వరకు వారే సాగు చేసుకున్నారని బెజ్జంకి మండలానికి చెందిన ఆర్టీఐ ప్రచార కమిటి చైర్మన్ రాసూరి మల్లిఖార్జున్ ఆర్టీఐ సమాచార సేకరణ చేసి లోకాయుక్తకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బెజ్జింకి తహసీల్దార్ గా పనిచేసిన నాగజ్యోతి అక్రమార్కులతో కుమ్మక్కై దళితులకు చెందిన భూమిని ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అక్రమాలకు పాల్పడిందన్నారు. ఫలితంగా 2018 ఆగస్టులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారని, దళితుల భూమిని ఇతరులకు పంపిణీ చేసిన తహసీల్దార్ నాగజ్యోతి నిర్వాకం వల్ల వారికి నష్టం కలిగినట్లు మల్లిఖార్జున్ ఆవేదన వ్యక్తం చేశారు.

తహసీల్దార్ నాగజ్యోతి అక్రమాల వల్ల సర్వే నెంబర్ 961 లో 9.20 ఎకరాలు సర్వే నెంబర్ 962లో సుమారు 26-17 ఎకరాల ప్రభుత్వ భూమి బెజ్జంకి గ్రామంతో సంబంధం లేని గూడెం గ్రామానికి చెందిన ఒకే కుటుంబానికి  కి చెందిన 7 గురు కుటుంబ సభ్యులకు ధారాదత్తం చేశారని పేర్కొన్నారు. ఇలా నాగజ్యోతి అవినీతి, అక్రమాల వల్ల దాదాపు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతానికి గురైనట్లు ఆరోపించారు. దీనిపై న్యాయ విచారణ జరిపించి నిజానిజాలు వెలికి తీసి దళితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. వీటికి సంబంధిచి పూర్తి వివరాలు తెలియజేస్తానని మల్లికార్జున్ పేర్కొన్నారు.


ఫిర్యాదు దారుడు రాసూరి మల్లికార్జున్
ఫిర్యాదు దారుడు రాసూరి మల్లికార్జున్
- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page