జనతా న్యూస్ బెజ్జంకి : సిద్దిపేట జిల్లా మానవ హక్కుల కమిటీ నూతన ఎన్నిక శుక్రవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర మానవ హక్కుల కమిటీ చేపట్టడం జరిగింది. ఈ ఎన్నికలలో బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామానికి చెందిన జెల్ల చంద్రయ్య జిల్లా అధ్యక్షులుగా ఎంపికయ్యారు . ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు జెల్ల చంద్రయ్య మాట్లాడుతూ మానవ హక్కులు “మనిషి మనిషిగా” జీవించడానికి ఎంతో తోడ్పడుతాయని , గౌరవప్రదమైన జీవన విధానానికి, వ్యక్తి ఆత్మస్థైర్యం పెంపొందడానికి మానవ హక్కులు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తనకు ఇంతటి బాధ్యత కట్టబెట్టిన జాతీయ మరియు రాష్ట్ర మానవ హక్కుల కమిటీ నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి ఆదేశానుసారం సంఘం బలోపేతం కోసం పనిచేస్తూ, పేద ప్రజల పక్షాన నిలబడుతూ వారికి మానవహక్కులు అందే వరకు వారి పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
మానవహక్కుల కమిటీ జిల్లా అధ్యక్షుడిగా జెల్ల చంద్రయ్య
- Advertisment -