జనతా న్యూస్ బెజ్జంకి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మానకొండూరు నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎన్నికై ఎమ్మెల్యే పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మంగళవారం బెజ్జంకి పర్యటనకు రావడంతో బెజ్జంకి ఎక్స్ రోడ్ నుండి కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతంతో గజమాలవేసి బైకు ర్యాలీ ద్వారా పార్టీ ఆఫీస్ వరకు స్వాగతించారు. అక్కడి నుండి ఎమ్మెల్యే పార్టీ శ్రేణులతో పాదయాత్ర ద్వారా అంబేద్కర్ కూడలికి చేరుకొని, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు పూలమాలవేసి నివాళి అర్పించి, బెజ్జంకి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ నాకు ఇంతటి భారీ మెజార్టీని అందించిన బెజ్జంకి మండల ప్రజలను ఎప్పటికీ మరువనని, నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని, నాయకుడిగా కాకుండా సేవకుడిగా పని చేస్తానని హామీ ఇచ్చారు. నిరంకుశత్వానికి, నియంతృత్వానికి తావులేని పరిపాలన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజలకు అందిస్తుందని తెలిపారు. భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వ భూములు లాగి భూమి లేని నిరుపేదలకు అందిస్తామని తెలిపారు. ప్రజలకు మరియు కార్యకర్తలకు సమన్యాయం అందిస్తానని కవ్వంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర వేణి పోచయ్య, మండల మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెప్యాల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జనగం శంకర్, కావ్వంపెల్లి యువసేన అధ్యక్షుడు కత్తి రమేష్ గౌడ్, రాష్ట్ర నాయకులు పులి కృష్ణ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మంకాల ప్రవీణ్, ఉపాధ్యక్షులు గండికోట సురేష్, మన కొండూరు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ధోనే వెంకటేశ్వరరావు, సీనియర్ నాయకులు మానాల రవి, బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య,జెల్ల ప్రభాకర్ యాదవ్, జెరూపొతుల మధు, తిప్పారం సురేష్, శనగొండ శ్రావణ్ కుమార్ , సిపిఐ నాయకులు మహేందర్, మధు, రూపేష్, ఎస్సీ సెల్, బీసీ సెల్ అధ్యక్షులు ఉపాధ్యక్షులు. బేగంపేట్ కార్యకర్తలు బేగంపేట్ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండా అమరేందర్ రెడ్డి, బేగంపేట మాజీ ఎంపీటీసీ మామిడాల జయరాం, పోతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, శీలం నర్సయ్య, మేకల కనకయ్య, గల్ఫ్ సేవా సమితి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు బుర్ర తిరుపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు బర్ల శంకర్, వెన్నం రాజు, తలారువానిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు రాజు మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
కవ్వంపల్లికి ఘన స్వాగతం పలికిన బెజ్జంకి కాంగ్రెస్ శ్రేణులు
- Advertisment -