Saturday, July 5, 2025

ర్యాలీలతో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు

పూల వర్షం కురిపించిన అభిమానులు

మంథనిలో ఐటి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు అపూర్వ స్వాగతం

మంథని జనతా న్యూస్:

అభిమానం అంబరాన్ని తాకితే ఆనందం అవధులు దాటితే ఉత్సాహం ఉప్పొంగితే ఉత్తేజం ఉవ్వెత్తున లేస్తే అది మంథని నియోజక వర్గం అవుతుంది ఆదివారం రాష్ట్ర ఐటీ ,పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ, మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి వచ్చిన రాష్ట్ర మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు లభించిన అపూర్వ స్వాగతం చూస్తే వాస్తవం అర్థమవుతుంది పల్లెల నుండి తరలివచ్చిన జనాన్ని చూస్తే కదులుతున్న జనం చూడు శ్రీధర్ బాబు జోరు చూడు మంతెనంత హోరు చూడు అనేటట్లు గా పల్లెలన్నీ కదిలి నాయి అనడంలో ఎలాంటి సందేహం కలగదు రాష్ట్ర మంత్రిగా మంథని నియోజకవర్గానికి వచ్చిన తరుణంలో పార్టీ శ్రేణులు ర్యాలీలతో కదంతొక్కగా అభిమానులు పూల వర్షం కురిపిస్తూ అఖండ స్వాగతం పలికారు వేలాదిమందిఅభిమానులతో నియోజకవర్గంలో భారీ ఊరేగింపు నిర్వహించారు జై శ్రీధర్ బాబు జై శ్రీను బాబు జై శ్రీపాద రావు అనే నినాదాలతో హోరెత్తించారు ఊరేగింపు మొత్తం పండుగలా సాగింది ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ జెండాలు రెపరెపలాడాయి ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మంథని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పొందుపరిచిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలను అమలుపరిచామని మిగిలినవి రెండు నెలల్లో అమలుపరుస్తామని అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలను అందజేస్తామని అన్ని రంగాల్లో తెలంగాణను నెంబర్ వన్ గా నిలుపుతామని అన్నారు తనను ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page