జడ్పిటిసికి సభా వేదికపై కుర్చీ వేయలేదని నిరసన
మానకొండూర్ నియోజక వర్గం , జనత న్యూస్:
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల ప్రజా పరిషత్ సమావేశం ఆదివారం జరగగా స్థానిక జడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డికి సభావేదికపై కుర్చీ వేయకుండా ప్రోటోకాల్ పాటించలేదని పలువురు బి.ఆర్.ఎస్ ఎంపీటీసీలు సర్పంచులు మండల సమావేశం లోనే కింద కూర్చొని నిరసన తెలుపుతూ సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళితే మండల సర్వసభ్య సమావేశానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరుకాగా సమావేశం ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశ వేదికపై జెడ్పిటిసి కి కుర్చీ వేయకుండా వేదిక కింద సర్పంచులతో కలిపి కుర్చీని వేయడం జరిగింది. ఇది గమనించిన బీఆర్ఎస్ కు చెందిన ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి కి వేదికపై ఎందుకు కుర్చీ వేయలేదని ఎంపీడీవో స్వాతిని నిలదీశారు. ఎంపీడీవోను మాట్లాడనీయకుండా అన్ని తామే అయి ఎమ్మెల్యే ఎంపీపీలు దురుసుగా మాట్లాడారని ప్రోటోకాల్ గురించి జడ్పీ సీఈఓ కు ఫోన్ ద్వారా సమావేశం ఇవ్వండి అని ఎమ్మెల్యే కవ్వంపల్లీ నీ సైతం కోరగా ఎవరికి ఫోన్ చేసేది లేదని తాను చెప్తుందే జరుగుతుందని దురుసుగా మాట్లాడడం జరిగిందని జెడ్పిటిసి మాడుగుల రవీందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ కు చెందిన ఎంపీటీసీలు గూడేల్లి ఆంజనేయులు వైస్ ఎంపీపీ న్యాత స్వప్న 10 మంది సర్పంచులు కింద కూర్చొని నిరసన తెలిపారు. అనంతరం జడ్పిటిసి రవీందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రోటోకాల్ గురించి ఎంపీడీవో స్వాతి పై జిల్లా కలెక్టర్కు రేపు ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే కవ్వంపల్లి ని తాము పార్టీలకు అతీతంగా మండల అభివృద్ధి కొరకు కలిసి పనిచేస్తామని మండల సమావేశంలో తాము చెప్పాలని అనుకున్నామని కానీ వారు కలుపుకుని పోలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు ఈ సమావేశంలో సర్పంచ్లు తీగల మోహన్ రెడ్డి గంప మల్లీశ్వరివెంకన్న,పీచు చంద్రా రెడ్డీ,పుల్లెల లక్ష్మి, అటికం శారద, నక్క మల్లయ్య,మధుకర్,సంపత్,నగేష్,రేణుక,పాల్గొన్నారు.