– మానకొండూరు ఎమ్మెల్యేకు వినతి
మానకొండూర్, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను గుర్తించి రక్షణ కల్పించాలని ఆర్టీఐ ప్రచార కమిటీ చైర్మన్ రాసూరి మల్లికార్జున్ మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ను కోరారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే నివాసంలో శనివారం ఆయనను మల్లికార్జున్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ మానకొండూరు నియోజకవర్గం లో ప్రభుత్వ భూములు కొన్ని అన్యాక్రాంతానికి గురయ్యాయని, గత ప్రభుత్వ హయాంలో నాయకులు వారి వారి కార్యకర్తలకు ధరణి సహాయంతో పట్టా మార్పిడి చేయించారని ఆరోపించారు. నియోజకవర్గంలో అనేక ప్రభుత్వములకు రక్షణ లేకుండా పోయిందని, కావున ప్రభుత్వ భూములను గుర్తించి అక్రమ దారులను రికార్డుల నుంచి తొలగించి, నిజమైన లబ్ధిదారుల పేర్లను యధావిధిగా నమోదు చేసి, ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాలన్నారు. అలాగే నియోజకవర్గం లోని వివిధ వరద కాలువల్లో నీరు నిల్వలు తగ్గాయని, రైతులు పొలాల్లో నాట్లకు సిద్ధం చేసుకుంటున్నారని నీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎంపిటిసి కసాని నర్సయ్య పులి రమేష్ కోరారు.
మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్రవేణి పోచయ్య సీఎం ఆర్ఎఫ్ గూర్చి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి నేటి వరకు అనేక ఆరోగ్యపరమైన సమస్యలు ఉత్తన్నమవుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్పందించి వారి సమస్యలకు పరిష్కారం చూపారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో మిట్టపెళ్లి చెన్నారెడ్డి,గాదం మల్లికార్జున్, కుక్కల పరశురాం తదితరులు పాల్గొన్నారు