– ఇల్లంతకుంట ఎస్ ఐ డి సుధాకర్
ఇల్లంతకుంట, జనతా న్యూస్: మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఇల్లంతకుంట ఎస్సై డి సుధాకర్ తెలిపారు. సోమవారం నాడు ఆయన సాయంత్రం ముస్కానిపేట గ్రామ రోడ్డుపై వాహనాలను తనిఖీ చేశారు ఈ తనఖీ లో భాగంగా ముస్కాన్ పేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చౌడారం గ్రామానికి చెందిన మరో వ్యక్తిపై మద్యం తాగి వాహనం నడిపినట్లు పరీక్షించిన అనంతరం వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన చోటే నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదని ఆయన పేర్కొన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపేవారు అన్ని కాగితాలు దగ్గర పెట్టుకోవాలని వాహనదారులకు ఆయన సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి న 31 వాహనాల పైన 4180 రూపాయలు జరిమానా విధించడం జరిగిందని పేర్కొన్నారు. ట్రాఫిక్ నిబంధనలు అందరూ పాటించాలని తెలిపారు. వాహనాల తనిఖీలు ఆయనతోపాటు ఏఎస్ఐ సంజీవరావు, మోతీ రామ్ హెడ్ కానిస్టేబుల్ భూమయ్య, కానిస్టేబుల్ లు కుంట శ్రీనివాస్ శ్రీకాంత్ లు పాల్గొన్నారు
