జనత న్యూస్ బెజ్జంకి : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా ప్రభుత్వం కొలువుతీరిన మూడవ రోజు, శ్రీమతి సోనియాగాంధీ జన్మదినం సందర్బంగా ప్రతి కుటుంబానికి ఏడాదికి 10లక్షల వరకు ఉచిత వైద్యం కోసం ఆరోగ్యశ్రీ మరియు మహిళలకు, విద్యార్థినీలకు, యువతులకు, బాలబాలికలకు ఉచిత బస్సు ప్రయాణం నేడు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కాగా బెజ్జంకి మండల కేంద్రములో నుండి పూర్వ జిల్లా కేంద్రం కరీంనగర్ వెళ్లే సెటిల్ బస్సులో మొదటిసారిగా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న ఆడవారికి స్వీట్ల పంపిణి చేసిన కాంగ్రేస్ నాయకులు.మనకొండూర్ సోషల్ మీడియా ఇంచార్జి దోనె వెంకటేశ్వర్ రావు కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు అవుతున్న విధానం ఎలా ఉందని మహిళా ప్రయాణికుల అభిప్రాయం అడగగా గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది గాని ఎవరికీ వచ్చియో తెలియదు. గతములో కాంగ్రేస్ పార్టీ ఇచ్చిన మాటమీద నిలబడింది కాబట్టే మేమంతా ఓట్లువేసి గెలిపించుకున్నాం అని తెలిపారు, కొంతమంది విర్ద్యార్ధినీలు కాంగ్రేస్ పార్టీకి మేము రుణపడి ఉన్నామని మా ప్రయాణ కష్టాలను గుర్తించింది కాంగ్రేస్ పార్టీ అని తెలుపుతూ మేము రోజు కాలేజీలకు వెళ్లి రావాలంటే వందల్లో ఖర్చు అయ్యేదని, ఒక్కోసారి మా తల్లిదండ్రుల దగ్గర లేకుంటే కాలేజీకి డుమ్మా కొట్టవలసివచ్చేది. పాసులున్న కొన్ని కిలోమీటర్ల పరిమితి ఉండేది తరువాత మేము మల్లి టికెట్ కొనేవాళ్ళం ఇప్పుడు మాకు చాల సంతోషంగా ఉంది కాకుంటే మా కాలేజీల సమయాలలో బస్సులు ఉంటే ఇంకా బాగుంటుందని తెలిపారు.బెజ్జంకి లోనుండి మొదటి మహిళల ఉచిత బస్సు ప్రయాణ స్వీట్ల పంపిణీలో మైల ప్రభాకర్, మానాల రవి, మానాల తిరుమల, బొనగం రాజేశం, శానగొండ శరత్ కుమార్,పుర్మ చంద్రారెడ్డి,లింగాల శ్రీనివాస్, దోనే రవి మహేష్, రాజు, రగుసాల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత బస్సు అమలుపై మహిళల హర్షాతిరేకాలు
- Advertisment -
