Saturday, March 14, 2026

రవాణా వ్యవస్థను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం : పొన్నం ప్రభాకర్‌

హైదరాబాద్‌, జనతా న్యూస్ : రవాణా వ్యవస్థను అతి త్వరలో గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఆర్టీసీ కనెక్టివిటీని పెంచుతామన్నారు. అందరూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు. సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా నేటి నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం ప్రారంభిస్తున్నామని చెప్పారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా గాంధీభవన్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రవాణా శాఖమంత్రిగా తొలి కార్యక్రమం తనతో ప్రాంభమవుతున్నదని వెల్లడిరచారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తరువాత ఉచిత బస్సు కార్యక్రమాన్ని సీఎం రేవంత్‌ ఆరంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 33 జిల్లాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతుందని తెలిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన క్యాబినెట్‌లోని మంత్రులకు శాఖలు కేటాయించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు కీలకమైన ఆర్థిక శాఖ అప్పగించగా, శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమల శాఖ కేటాయించారు. మరో సీనియర్‌ నేత అయిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి నీటిపారుదల శాఖ అప్పగించారు. ఇక హోం, పురపాలక, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలను ముఖ్యమంత్రి తనవద్దే ఉంచుకున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page