- బద్దలయిన గడీల కోట ఇనుప కంచె
హైదరాబాద్, జనతా న్యూస్: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం చేసిన తరవాత మంత్రులతో పాటు సామాన్యులు, జర్నలిస్టులు స్వేచ్ఛగా సచివాలయంలోకి అడుగు పెట్టారు. సిఎం కూడా తనచుట్టూ మూగిన వారికి అభివాదం చేస్తూ సాదాసీదా లోనికి వెళ్లారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరవాత తొలిసారి సచివాలయంలో ఇలాంటి ప్రేమానురాగాలు తాండవించాయని కొందరు కొనియాడారు. తామంతా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేస్తామని ఇక్కడ అడుగు పెట్టామని మంత్రులు ప్రకటించారు. పొన్నం ప్రభాకర్ అయితే సచివాలయ ద్వారం వద్ద దండంపెట్టి అడుగు పెట్టారు. నిజానికి తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు..మేధావులు కావచ్చు..వారు కోరుకున్నది పదవులు కాదు, తెలంగాణ నిర్మాణంలో పాత్ర మాత్రమే. వారంతా గత పదేళ్ల కాలంలో తీవ్రమైన అణచివేతకు, నిరాదరణకు గురయ్యారు. కానీ ఇప్పుడు సచివాలయంలోకి స్వేచ్ఛగా అడుగుపెట్టడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.