మంథని, జనతా న్యూస్: బహుజనవాదం బలంగా వినిపిస్తున్న మంథని నియోజకవర్గంలో అందరివాడిగా, ప్రజా నాయకుడిగా ఎన్నో సవాళ్లను పద్మవ్యూహం ల చేదించి అధిగమించి మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే గా పరిపాలన అధ్యక్షుడిగా దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర మంత్రివర్గ పీఠాన్ని అధిరోహించారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రూపకర్తగా అపార మేధోసంపత్తిని కనబర్చి కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ ప్రజలకు అద్భుతమైన మానిఫెస్టో ను అందించారు. మొదటినుండి సౌమ్యునిగా సమర్థవంతమైన నాయకుడిగా అధిష్టానం మెప్పు పొందిన నాయకుడిగా ఏఐసిసి కార్యదర్శిగా ఈ మధ్యనే జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల ఇన్చార్జిగా ప్రతి స్థాయిలోనూ అద్భుత పనితీరును కనబరిచారు. అపారమైన అనుభవం వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తిత్వం చట్ట న్యాయ శాసన పరమైన అంశాల పై అమితమైన పట్టు విధానపరమైన సమస్యలను పరిష్కరించే నేర్పరితనం దుద్దిల్ల శ్రీధర్ బాబు సొంతం.
1969 లో జన్మించిన దుద్దిల్ల శ్రీధర్ బాబు 1992-95 సంవత్సరం వరకు న్యాయవిద్యనభ్యసించి 1998లో హైకోర్టు అడ్వకేట్ గా తన ప్రస్తానం మొదలుపెట్టారు. 1999లో తండ్రి శ్రీపాదరావు మరణం అనంతరం రాజకీయ ఆరంగ్రేటo చేసి మంథని నియోజకవర్గ ఎమ్మెల్యేగా 2004, 2009, 2018, 2023 లలో ఎమ్మెల్యేగా గెలుపొంది మంథని నుండే ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో శ్రీధర్ బాబు తనదైన చరిత్ర సృష్టించారు. గతంలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరు పై ఉన్న రికార్డును బడ్డలుకొట్టారు. 2004 2006 సంవత్సరం వరకు టీటీడీ బోర్డు మెంబర్ గా, 2004 నుండి 2009 వరకు ప్రభుత్వ విప్ గా, 2010 నుండి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా పని చేశారు ఈ కాలంలో మంథని నియోజకవర్గం ను అనేక రంగాల్లో అభివృద్ధి పరిచారు.
అదే సమయంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమి చెందారు. పార్టీలో చురుగ్గా ఉంటూ 2016 నుండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవులు నిర్వహిస్తున్నారు. 2023 సంవత్సరం ఎన్నికల దృష్ట్యా తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రతి వీధికి ప్రతి గడపకు ప్రతి కుటుంబానికి ప్రతి సభ్యునికి చేరే విధంగా అర్హులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా పథకాలను రూపొందించారు. ఈ పథకాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన వందరోజుల్లోనే అమలు చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మాట తప్పే మడిమ తిప్పే అలవాటు లేదని, అధికారంలో రాగానే నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. అవినీతి రహితంగా మచ్చలేని నాయకుడుగా శ్రీధర్ బాబు మళ్లీ మంథని నియోజకవర్గ శాసనసభ్యుని గా ఎన్నికవడం తో మరోసారి ఇక్కడి ప్రజల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి. శ్రీధర్ బాబు కు నూతన కాంగ్రెస్ ప్రభుత్వం లో మంత్రివర్గంలో ముఖ్యమైన శాఖ లభించి ఆ శాఖ ద్వారా తెలంగాణ ప్రజలకు ప్రయోజన ఫలాలు అందాలని మంథని నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు