Saturday, September 13, 2025

సర్కార్‌ స్కూళ్ల మూతతో ప్రైవేట్‌ పెత్తనం

  • మూసేసిన స్కూళ్లను తెరిపించాలన్న డిమాండ్‌
  • పాఠశాలల్లో వసతుల కల్పనకు చర్యలు అవసరం
(యాంసాని శివకుమార్ -జనతా న్యూస్)

గతంలో మారుమూల పల్లెలకు కూడా విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఏకోపాధ్యాయ పాఠశాలలను తెలంగాణ ఏర్పడ్డ తరవాత పలు కారణాలు చూపి గత ప్రభుత్వం మూసేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యల లేదన్న కారణంతో మరికొన్ని పాఠశాలలను మూసేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 6వేలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయని గణాంకాలు చెబుతు న్నాయి. దీనికితోడు డిఎస్సీలను నిర్వహించక పోవడంతో పాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడిరది. ఇదంతా ఓ పద్దతి ప్రకారం, ప్రైవేట్‌ పాఠశాలను ప్రోత్సహించే కుట్రలో భాగంగా జరిగిందన్న ఆరోపణలు ఉన్నారు. ఈ క్రమంలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కూడా అనేక పాఠశాలలు మూతపడ్డాయి. ఈ విషయంపై ఎమ్మెల్యేలు కానీ మంత్రులుగా ఉన్న వారు కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. ఇప్పుడు మూతపడ్డ పాఠశాలలను తెరిపించాల్సి ఉంది. అలాగే పాఠశాలల్లో కనీస వసతులు కల్పించి, డిఎస్సీ నిర్వహించి పేదలకు చదువును చేరురు చేయవలసిన అసవరం కూడా ఉంది.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తమకు అనుకూలంగా మలచుకున్న అనేక ప్రైవేట్‌ పాఠశాలు మండలస్థాయిలో బ్రాంచ్‌లను పెట్టి..గ్రామాల నుంచి బస్సులను పెట్టి విద్యార్థులను తమ పాఠశాలల్లో చేర్పించుకున్నారు. ఇబ్బడిముబ్బడిగా ఫీజలను దండుకున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అనేకమంది ఉన్నతవిద్యావంతులుప్రైవేట్‌ పాఠశాల్లో వెట్టి చేయాల్సిన దుస్థితి ఏర్పడిరది. ఇకపోతే జిల్లాల్లోని అనేక ప్రైవేటు పాఠశాలల్లో శిక్షణ, అనుభవం లేని ఉపాధ్యాయులతోనే నెట్టుకొస్తున్నా రని విద్యాశాఖ నిర్వహించిన సర్వేలో తేలింది. కొన్ని పాఠశాలలు కేవలం పై మెరుగుల తో విద్యార్థులను ఆకట్టుకుంటున్నాయి. వేలల్లో ఫీజులు వసూలు చేసే ప్రైవేటు పాఠశాలల్లో కొన్నిటిలో మాత్రమే కనీస సామర్థ్యాలు కనిపించాయి. చాలాచోట్ల బట్టీ విధానం తప్ప పిల్లలకు అవగతమయ్యే రీతిలో బోధించడం లేదని గుర్తించారు. పలు ప్రైవేటు పాఠశాలల్లో గైడ్లు, పుస్తకాలపైనే ప్రధానంగా ఆధారపడు తున్నట్లు గుర్తించారు. గురుకులాల ఏర్పాటుతో అక్కడ చదువుతున్న విద్యార్థులు ఇందులో చేరుతున్నారు.

ఇక్కడ చేరిన విద్యార్థుల నైపుణ్యాలు పరిశీలించగా ఈ విషయాలు బయట పడుతున్నాయని పలువురు ఉపాధ్యాయులు వెల్లడిరచారు. ప్రైవేట్‌ పాటశాలల్లో విద్య మిధ్య అన్న నిజాన్ని అధికారులు గుర్తించారు. తాజాగా గురుకులాలు మొదలయ్యాక అనేకమంది తల్లిదండ్రులు తమ పిల్లను ఇందులో చేర్చడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే చాలా ప్రైవేట్‌ పాఠశాలలు తల్లిదండ్రులను మెప్పించడానికి మార్కులు వేసి పిల్లలు బాగా చదువుతున్నారని చూపుతున్నట్లు తేలింది. దీంతో పిల్లలకు జ్ఞానం అబ్బకున్నా, పాళ్యాంశాలపై పట్టు లేకున్నా రికార్డుల్లో మార్కులు ఎక్కవ వేసి పాస్‌ చేసి చూపిస్తున్నారు. ఇలాంటి వారు ఇప్పుడు గురుకులాల్లో చేరేసమయంలో బయటపడుతున్నారు.

దీనికితోడు పైసా ఖర్చు లేదన్న భావనలో తల్లిదండ్రులు ఉన్నారు. ఇదే సమయంలో పలుచోట్ల ప్రైవేట్‌ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించినప్పుడు డొల్ల బయట పడుతోంది. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతున్నారే తప్ప విద్యార్థులకు అర్థమవుతుందో లేదో పట్టించుకోవటం లేదని తేలిపోయింది. ఇటీవల అనేక సందర్భాల్లో గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులే మెరుగైన సామర్థ్యాలు కనబరిచారు. జిల్లాల్లోని పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పరిస్థితి చూస్తే ప్రతి విద్యార్థి బట్టీ చదువులు మాత్రమే కొనసాగుతున్నాయి. కనీస సామర్థ్యాలు లేక విద్యార్థుల్లో సృజనాత్మకత కరవైంది. నైపుణ్య సాధనలోవెనుకబడిరది.

ప్రభుత్వ పాఠశాలల్లోనే సంగ్రహణాత్మక మూల్యాంకనం అమలు బాగుందని గుర్తించారు. ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు సరైన శిక్షణ లేకపోవడంతో బట్టీ విధానం ఫాలో అవుతున్నట్లు తేలింది. ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డుల నిర్వహణ బాగున్నా, 90 శాతం ప్రైవేటు పాఠశాలల్లో సరైన రికార్డులు లేవు. విద్యార్థులకు పాఠాలతోపాటు నిర్వహించే సహ పాఠ్యాంశాల అమలు 38 శాతం పాఠశాలల్లో మాత్రమే బాగుంది. మిగిలిన చోట్ల ఉపాధ్యాయులు, ఇతర కార్యక్రమాలపై దృష్టిపెట్టడం లేదని తేటతెల్ల మైంది.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page