ఇల్లంతకుంట, జనతా న్యూస్: ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ అభ్యర్థి సత్యనారాయణ మానకొండూరు నియోజకవర్గం నుండి గెలుపొందితే 101 కొబ్బరికాయలు కొబ్బరికాయలు కొడతానని పోచమ్మ తల్లికి జవారిపేట గ్రామస్తుడు మండ మండల ఫిషరీస్ చైర్మన్ జెట్టి మల్లేశం మొక్కుకున్నారు.ఆ ప్రకారం గా సోమవారం మండల కాంగ్రెస్ నాయకుల సమక్షంలో 101 కొబ్బరికాయలు పోచమ్మ తల్లికి కొట్టి తన మొక్కు చెల్లించుకున్నాడు. ఈ కార్యక్రమం అనంతరం మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పశుల వెంకటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో మా నాయకుడు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చూస్తానని పసుల వెంకటి అన్నారు .ఈ కార్యక్రమంలో మండల మైనారిటీ సెల్ అధ్యక్షుడు జమాల్, ఇల్లంతకుంట టౌన్ ప్రెసిడెంట్ మామిడి నరేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మచ్చ రాజేశం, ప్రధాన కార్యదర్శి కాష్పాక రమేష్, సోషల్ మీడియా అధ్యక్షుడు సాయి వర్మ, బడుగు లింగం తదితరులు పాల్గొన్నారు.
‘కవ్వంపల్లి’ గెలుపుతో మొక్కుతీర్చుకున్ననాయకులు
- Advertisment -