- ప్రతిపక్షాలు విష ప్రచారానికి తెరలేపారు
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాంటెస్ట్ ఎమ్మెల్యే చంద్రుపట్ల సునీల్ రెడ్డి
మంథని, జనతా న్యూస్: మంథని నియోజక వర్గంలో మార్పు కోసం పరితపిస్తున్నామనిఅధికారం ఎవరికీ శాశ్వతం కాదనీ, ఓటమితో మరింత బలంగా అవుతామనిబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాం రెడ్డి అన్నారు. మంథని పట్టణంలోని బిజెపి ఆఫీస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో సునీల్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలు ప్రకటించిన హామీలు నెరవేర్చలేని పక్షంలో ప్రజల తరుపునపోరాడుతామన్నారు. మంథని లో చిల్లర రాజకీయాలకు ప్రతిపక్షాలు తెరలేపారన్నారు. నేను ప్రతిపక్షాలకు అమ్ముడు పోయానని విష ప్రచారం చేశారనీ మండిపడ్డారు.
తనను నమ్మి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఒక నీతి నిజాయతి గల పార్టీ బీజేపీ అనినమ్మిన సిద్ధాంతం కొరకు పని చేస్తామన్నారు. మేము ఓటర్లను ప్రలోభ పరచలేదని మంథని లో కాలేజీ లు, ఫ్యాక్టరీ లు, హాస్పిటల్ లు రావాలనీ ఆకాంక్షించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతమని అన్నారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్యప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి పోతరవేణి క్రాంతికుమార్, కాటారం మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి లు పూసల రాజేంద్ర ప్రసాద్, బొల్లం కిషన్, మేడిపల్లి పూర్ణ చందర్, మండల ఉపాధ్యక్షులు రేపాక శంకర్, సీనియర్ నాయకులు కొట్టె సాంబయ్య, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.